ముగ్గురు మావోయిస్ట్‌ల అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-08T02:35:32+05:30 IST

నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన బోడ

ముగ్గురు మావోయిస్ట్‌ల అరెస్ట్

నిజామాబాద్: నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన బోడ జనార్ధన్, పల్లికొండ గంగాధర్, అంఖేష్ కమల్ అనే ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. నగరంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను సీపీ వెల్లడించారు. వారి నుంచి భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. మాజీల ముసుగులో కార్యాకలాపాలు విస్తరిస్తున్నారన్న సమాచారం మేరకు పథకం ప్రకారం వీరిని జక్రాన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారన్నారు. ముగ్గురిపై సెక్షన్ 120, 120 (బీ)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మరో నలుగురు మావోయిస్టులు పరారీలో ఉన్నారని సీపీ పేర్కొన్నారు. వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీపీ తెలిపారు. 

Updated Date - 2022-04-08T02:35:32+05:30 IST