Bobby Kataria: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని మందు తాగిన బాబీ కటారియాపై అరెస్ట్ వారెంట్ జారీ

ABN , First Publish Date - 2022-08-20T01:21:28+05:30 IST

స్పైస్‌జెట్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ కాల్చుతూ వీడియోలు పోస్టు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్

Bobby Kataria: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని మందు తాగిన బాబీ కటారియాపై అరెస్ట్ వారెంట్ జారీ

డెహ్రాడూన్: స్పైస్‌జెట్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ కాల్చుతూ వీడియోలు పోస్టు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బాబీ కటారియా (Bobby Kataria) గుర్తున్నాడా?. అతడిపై ఇప్పుడు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ (NBW) జారీ అయింది. రోడ్డు మధ్యలో కుర్చీలు వేసుకుని బహిరంగంగా మద్యం తాగిన కేసులో ఈ వారంట్ జారీ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు.


అతడిని అరెస్ట్ చేసేందుకు హర్యానాకు పోలీసు బృందాన్ని పంపినట్టు డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ సింగ్ రావత్ తెలిపారు. రోడ్డు మధ్యలో మద్యం తాగుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత అతడికి మూడు నోటీసులు పంపామని, అయినప్పటికీ ఆయన స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు చెప్పారు. 


హర్యానాకు చెందిన బాబీ కటారియా గత వారం ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనిపై డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, విమానం సీట్లో సిగరెట్ తాగిన వీడియోపై పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) విచారణకు ఆదేశించారు. జనవరి 20న ఢిల్లీ-దుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగినట్టు స్పైస్‌జెట్ (spicejet) తెలిపింది. అలాగే, కటారియా పేరును  ‘నో ఫ్లైయింగ్’ జోన్‌లో చేర్చినట్టు పేర్కొంది. 

Updated Date - 2022-08-20T01:21:28+05:30 IST