arrest: ఏపీలో నలుగురిని, తెలంగాణలో ఒకరిని అరెస్ట్ చేశాం: NIA

ABN , First Publish Date - 2022-09-23T00:35:11+05:30 IST

arrest: ఏపీలో నలుగురిని, తెలంగాణలో ఒకరిని అరెస్ట్ చేశాం: NIA

arrest: ఏపీలో నలుగురిని, తెలంగాణలో ఒకరిని  అరెస్ట్ చేశాం: NIA

ఢిల్లీ: నలుగురిని ఏపీలో, ఒకరిని తెలంగాణలో అరెస్ట్ చేశామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. పీఎఫ్‌ఐ కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాల్లో NIA అధికారులు తనిఖీలు చేశారు. 5 కేసుల్లో ఇవాళ (గురువారం) 45 మందిని అరెస్ట్ చేశామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీలో నమోదు చేసిన 3 కేసుల్లో 29 మంది అరెస్ట్ చేశామని, కొచ్చిలో నమోదు చేసిన కేసులో 11 మందిని అరెస్ట్ చేశామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. తెలంగాణ (Telangana)లో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు (NIA Raids) చేపట్టింది. టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఎన్ఐఏ(NIA)  సోదాలు నిర్వహించింది. కర్ణాటక (Karnataka) ,కేరళ (Kerala), యూపీ (UP) రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సోదాలు జరిపారు. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు ఏపీ(Andhrapradesh) రాష్ట్రంలోని ఏపీలోని కర్నూలులో ఎన్‌ఐఏ తనిఖీలు చేశారు.


దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు

గురువారం యూపీ, కేరళ సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాలపైనా దాడులు చేశారు. కాగా... రెండు రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో  పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిజామాబాద్, నెల్లూరు జిల్లాలో పలువురిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐకి చెందిన సుమారు 100 మంది ముఖ్యలను ఎన్‌ఐఏ అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఆపరేషన్‌లో ఎన్ఐఏతో పాటు ఈడీ, స్థానిక పోలీసులు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాల వెల్లడి వెల్లడించాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం,  ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం, మానసికంగా మార్చడం వంటి అనేక ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. సుమారు 40 ప్రదేశాల్లో జరుగుతున్న సోదాల్లో దర్యాప్తులో ఈడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-23T00:35:11+05:30 IST