వీఆర్‌ఏలను అరెస్టు చేయించడం సరికాదు

ABN , First Publish Date - 2022-05-22T06:02:03+05:30 IST

సమస్యలు పరిష్కరిం చాలని చలో సీసీఎల్‌ఏ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న వీఆర్‌ఏలను ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం సరికాదని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి వీరన్న అన్నారు.

వీఆర్‌ఏలను అరెస్టు చేయించడం సరికాదు
రామన్నపేటలో నినాదాలు చేస్తున్న వీఆర్‌ఏలు

మోత్కూరు/ వలిగొండ/ రామన్నపేట/ ఆత్మకూరు(ఎం),/ రాజాపేట/ బీబీనగర్‌/ తుర్కపల్లి మే 21: సమస్యలు పరిష్కరిం చాలని చలో సీసీఎల్‌ఏ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న వీఆర్‌ఏలను ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం సరికాదని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి వీరన్న అన్నారు. శాంతియుతంగా నిరసకు వెళ్తున్న అడ్డగూడూరు మండల వీఆర్‌ఏలను పోలీసులు మందస్తుగా శనివారం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లావ్యాప్తంగా వీఆర్‌ఏలను అరెస్టు చేయడం బాధాకరమన్నారు. వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం అడ్డగూడూరు మండల అధ్యక్షుడు మేకల యాదగిరి, ఉపాధ్యక్షుడు నాయకులు బందెల వీర స్వామి, కృష్ణ, నర్సింహ, మల్లేష్‌, రాములు, గోపాల్‌, వెంకన్న, చరణ్‌, సోమయ్య, చంద్రమౌళి, సురెందర్‌, నరేష్‌ ఉన్నారు. మోత్కూరు మండలం నుంచి సీసీఎల్‌ఏ ముట్టడికి వెలుతున్న వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లో తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలి పెట్టారు. అరెస్టు అయిన వారి లో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల సైదులు, కిరణ్‌, సంపత్‌, వెంకటయ్య, నర్సయ్య, యాకు, మచ్చగిరి, పెద్దులు, ఉన్నారు. వలిగొండలో వీఆర్‌ఏలు జిట్టగోని నాగరాజు, ఈదులు, యాకూబ్‌, ఎల్లయ్య, భిక్షపతి, చంద్రయ్య, తిరుపతయ్య, భగవం తును ముందస్తుగా అరెస్టు చేశారు. రామన్నపేటలో వీఆర్‌ఏ లను అరెస్టు చేశారు. కార్యక్రమంలో జెల్లెల పెంటయ్య, బొడ్ల భాషైయ్యా, ఏ వెంకన్న, యూసుఫ్‌, మల్లయ్య పాల్గొన్నారు.  సీఐటీయూ నాయ కుడు ఎంవీరెడ్డి వీఆర్‌ఏలకు సంఘిభావం తెలిపారు. ఆత్మకూరు (ఎం) మండలంలోని వీఆర్‌ఏలను పోలీసులు మందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో అయి లయ్య, క్రిష్ణ, మల్లయ్య, శేఖర్‌, గణేష్‌,  భాను, మల్లేశం ఉన్నారు. రాజాపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట వీఆర్‌ఏలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు కృష్ణ, చంద్రకళ, గచ్చిబౌలి కవిత, భవానీ, పెంటయ్య, అంజనేయులు  పాల్గొన్నారు. ముందస్తు అరెస్టుకు నిర సనగా బీబీనగర్‌లో వీఆర్‌ఏలు పోలీస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహి ంచారు. తుర్కపల్లిలో వీఆర్‌ఏలను ముందస్తుగా అరెస్టు చేశారు.  

Updated Date - 2022-05-22T06:02:03+05:30 IST