విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
కొత్తూరు, జనవరి 20: హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను హరించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉద్యోగులకు పురోగమనం లేకపోగా తిరోగమన విధానం జగన్ పాలనలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. అతని వెంట నాయకులు మళ్ల సురేంద్ర, నీలబాబు ఉన్నారు.