కళ తప్పిన వేరుశనగ పంట

ABN , First Publish Date - 2022-08-08T04:59:38+05:30 IST

ఎప్పుడూ సుమారు రెండు వేల హెక్టార్లకు పైగానే సాగవుతున్న వేరుశనగ ఈ ఖరీఫ్‌లో 450 హెక్టార్లలో సాగుచేయడంతో కళతప్పినట్లైంది.

కళ తప్పిన వేరుశనగ పంట
సాగులో ఉన్న వేరుశనగ పంట

వెంటాడుతున్న కూలీల కొతర

50 శాతం తగ్గిన సాగు

రామాపురం, ఆగస్టు 7: ఎప్పుడూ సుమారు రెండు వేల హెక్టార్లకు పైగానే సాగవుతున్న వేరుశనగ ఈ ఖరీఫ్‌లో 450 హెక్టార్లలో సాగుచేయడంతో కళతప్పినట్లైంది. మండల వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో రైతులు వేరుశనగ పంటను సాగు చేయాలని మొగ్గుచూపడం లేదు. కూలీలు పంట పొలాలకు రాకపోవడం కొంత వరకు ప్రభుత్వం పథకాలతో కూలీలు రాకపోవడం మరొకటి. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఆనుకుని ఉన్న గ్రామాల్లో వేరుశనగ పంట సాగు చేస్తే అడవి పందుల దాడి తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం పంటలు సాగు చేసేందుకు చాలా మంది రైతులు ముందుకు రాలేదన్నారు. పంట పొలాల్లో పనులు చేసేందుకు కూలీలు సైతం ముందుకు రాకపోవడం రైతుకు ఇబ్బందికరమైంది. అప్పుచేసి పంట సాగు చేయాలంటే దిగుబడి వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఫలితంగా కొంత మంది రైతులు వేరుశనగ పంటపైన మొగ్గు చూపకపోయారు. మరికొందరు దిగుబడిపై ఆశతో సాగు చేశారు.

గతేడాది సాగు చేసిన రైతు లు తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురవకపోవ డంతో పంట పూర్తిగా దెబ్బతిని అప్పులపాలైనట్లు రైతులు పేర్కొ న్నారు. రెండు, మూడేళ్లగా వేరుశనగ సాగు చేసినా దిగుబడి సరిగ్గా రాకపోవడంతో చేసి న అప్పు తీర్చలేకున్నామని పలువురు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వర్షాలు కురవడంతో వచ్చి పంట పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం ఏ మాత్రం నష్టపరి హారం ఇవ్వకపోవడంతో మరింత అప్పుల్లోకి కూరుకుపోయామని రైతులు వాపోతున్నా రు. సంబంధిత అధికారులు పంట నష్టం నమోదు చేసి ఉండి ఉంటే మేలు జరిగేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాయలు మగ్గిపోయాయి

గత ఖరీఫ్‌లో ఎకరా సాగు చేస్తే కాయలు మగ్గిపోయాయి. ఇందుకు రూ. 25 వేలు ఖర్చు వచ్చింది. సక్రమంగా వర్షాలు లేక చా లా పంట దిగుబడి తగ్గింది. పూర్తిగా నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

చంద్రమోహన్‌, చింతలవాండ్లపల్లె రైతు

ఖర్చయినా రాలేదు

 ఖరీఫ్‌లో ఎకరా వేరుశనగ పంట సాగు చేశా ను. పంటకు ఖర్చు ఎకరాకు రూ.25 వేలు వచ్చింది. వర్షాలు పడకపోవడంతో పంట కూ డా సరిగ్గా రాలేదు. పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నా. 

చెండ్రాయుడు, మాజీ ఎంపీటీసీ

వర్షాలు సరిగ్గా పడకపోవడంతో....

 ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో మండల వ్యాప్తంగా 450 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు.  అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న గ్రామాల రైతులు అడవి పందుల దాడికి తట్టుకోలేక చాలా మంది పంటను వేయడం మానేశారు. 

నాగమణి, వ్యవసాయాధికారి

Updated Date - 2022-08-08T04:59:38+05:30 IST