కళాను అరెస్టు చేయలేదు: సజ్జల

ABN , First Publish Date - 2021-01-22T09:12:29+05:30 IST

టీడీపీ నాయకుడు కళావెంకట్రావును అరెస్టు చేయలేదని.. పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

కళాను అరెస్టు చేయలేదు: సజ్జల

అమరావతి/విశాఖపట్నం/చిత్తూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకుడు కళావెంకట్రావును అరెస్టు చేయలేదని.. పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇంకోవైపు.. కళావెంకట్రావుకు నోటీసిచ్చి విచారణకు పిలిచి పంపేశామని, దీనిపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని విశాఖలో విలేకరులకు తెలిపారు. కాగా, ‘మా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది.. అధికారులు ఎన్నుకున్నది కాదన్న విషయాన్ని ఎన్నికల కమిషనర్‌ గుర్తుంచుకోవాలి’ అని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. 

Updated Date - 2021-01-22T09:12:29+05:30 IST