బహుమతి అందిస్తున్న జబర్దస్త్ అప్పారావు
హిరమండలం: నేటి యుగంలో పౌరాణిక నాటకాలు కనుమరుగవుతున్న తరు ణంలో నాటక రంగ కళాకారులను ఆదరించాల్సి అవసరం ఎంతైనా ఉందని జబర్దస్త్ అప్పారావు అన్నారు. శుక్రవారం సుబలయ ఆర్ఆర్ కాలనీలో చీమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం ఆధ్వర్యంలో పౌరాణిక ఏకపాత్ర పద్య నాటక రంగస్థల పోటీలను సామాజిక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది రంగస్థలం మాత్రమేనని, నాటక సమాజాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చి పౌరాణిక పద్య నాటక పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు పాల్గొన్నారు.