ఆరు బయట

ABN , First Publish Date - 2021-04-19T05:48:08+05:30 IST

తలుపులు మూసేసి కవిత రాద్దామని కూర్చున్నాను చల్లని గాలి వీస్తున్నది సన్నటి వెల్తురు కురుస్తున్నది...

ఆరు బయట

తలుపులు మూసేసి

కవిత రాద్దామని కూర్చున్నాను

చల్లని గాలి వీస్తున్నది 

సన్నటి వెల్తురు కురుస్తున్నది

వర్షంలో ఓ సైకిల్‌ నిలబడి వుంది 

ఓ పిల్లాడు ఇంటికి తిరిగి వస్తున్నాడు

నేనో కవిత రాసాను

దాంట్లో చల్ల గాలి లేదు

వెల్తురు లేదు

సైకిల్‌ లేదు

పిల్లాడూ లేడు

మూసిన తలుపూ లేదు 


హిందీ & ఇంగ్లీష్‌ మూలం  మంగలేష్‌ దబ్రాల్‌

తెలుగు  వారాల ఆనంద్‌


Updated Date - 2021-04-19T05:48:08+05:30 IST