ఆరుద్ర పురుగులొచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2021-06-23T06:55:00+05:30 IST

చానా యేళ్ల తర్వాత పొలాల్లో ఆరుద్ర పురుగులు కనిపిస్తున్నాయి. సాధారణంగా రైతులు దుక్కులు దున్నాక ఎర్రని చుక్కల్లా పొల్లాల్లో చెట్లమీదా, కలుపు మీదా, మట్టిలో తిరుగుతూ కనిపిస్తాయి.

ఆరుద్ర పురుగులొచ్చేశాయ్‌!

పీలేరు : చానా యేళ్ల తర్వాత పొలాల్లో ఆరుద్ర పురుగులు కనిపిస్తున్నాయి.  సాధారణంగా రైతులు దుక్కులు దున్నాక ఎర్రని చుక్కల్లా పొల్లాల్లో చెట్లమీదా, కలుపు మీదా, మట్టిలో తిరుగుతూ కనిపిస్తాయి.  వీటిని ఏ రైతు చంపడు.. ఎవరినీ చంపనీయడు. దేవతలకు, వరుణ దేవుడికీ ప్రతి రూపంగా వీటిని భావిస్తారు. ‘వానలు బాగా పడి కాలమవుతుందనుకుంటేనే ఆరుద్ర పురుగులు  మనుషులకు కనిపిస్తాయి’ అని ఒక నమ్మకం. వానకి సంకేతంగా భావించే ఈ ఎర్ర పురుగులు కనిపిస్తే రైతులు సంబరపడుతారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఇది. రైతు నేస్తాలుగా వీటిని పిలుస్తారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు చల్లడం, రసాయనాలు పిచికారీ చేయడం వంటి కారణాలతో ఆరుద్ర పురుగులు దాదాపుగా అంతరించిపోయాయి. ఇప్పుడివి జిల్లా పడమటి ప్రాంతంలో అక్కడక్కడా తిరిగి కనిపిస్తున్నాయి.





Updated Date - 2021-06-23T06:55:00+05:30 IST