నెలాఖరుకు రైతులకు పెట్టుబడి రాయితీ

ABN , First Publish Date - 2020-12-03T06:15:32+05:30 IST

నివర్‌ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ము ఈ నెలాఖరు నాటికీ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ రైతులకు తెలిపారు.

నెలాఖరుకు రైతులకు పెట్టుబడి రాయితీ
మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌

 రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌

కూచిపూడి, పామర్రు, ఘంటసాల, డిసెంబరు 2 : నివర్‌ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ము ఈ నెలాఖరు నాటికీ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ రైతులకు తెలిపారు. మొవ్వ, పామర్రు, ఘంటసాల మండలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఘంటసాల మండలంలో 21 రెవెన్యూ విలేజ్‌ల పరిధిలో నష్టం వాటిల్లిన పంటల ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయగా, కమిషనర్‌ ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. దెబ్బతిన్న ధాన్యం, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే పంట నష్టం అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ -క్రాప్‌ డేటా ఆధారంగా కౌలు రైతులకు కూడా న్యాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి అవసరమైన విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించే ఆలోచనలో రాష ్ట్రప్రభుత్వం ఉందని వ్యవసాయాశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు.  పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జేడీఏ టి.మోహనరావు, ఏడీఏ ఎం.శ్రీనివాసరావు, ఏవో శివప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-03T06:15:32+05:30 IST