హోటల్ Signboards లో ఆ పదం తీసేయండి...

ABN , First Publish Date - 2022-07-15T22:15:50+05:30 IST

హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్‌లగున్ సబ్ డివిజిన్ అధికారులు తాజా..

హోటల్ Signboards లో ఆ పదం  తీసేయండి...

ఇటానగర్: హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal pradesh)లోని నహర్‌లగున్ సబ్ డివిజిన్ అధికారులు తాజా ఆదేశాలిచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్ల సైన్‌బోర్డులపై 'బీఫ్' (Beef) అనే పదం తీసేయాలని ఆదేశాలిచ్చారు. సెక్యురలిజం స్ఫూర్తి (Spirit of secularism)తో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇటానగర్ కేపిటల్ కాంప్లెక్స్‌‌ నహర్‌లగున్ సబ్ డివిజన్ అదనపు అసిస్టెంట్ కమిషనర్ టమో డాడా ఈనెల 13న ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18వ తేదీలోగా తమ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని, అలా పాటించని పక్షంలో రూ.2,000 జరిమానా విధిస్తామని, వ్యాపార లైసెన్స్ రద్దుకు చర్చలు తీసుకుంటామని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.


రాజ్యాంగంలోని సెక్యులర్ స్ఫూర్తికి జిల్లా యంత్రాగం కట్టుబడి ఉందని, సైన్‌బోర్డులలో బీఫ్ (Beef) అనే పదాన్ని బహిరంగంగా ప్రదర్శించడం వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇందువల్ల వివిధ వర్గాల మధ్య శత్రుత్వం తలెత్తే అవకాశాలున్నాయని అదనపు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. సెక్యులరిజం, సోదరభావం స్ఫూర్తితో వివిధ వర్గాల మధ్య ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ఈనెల 18వ తేదీలోగా 'బీఫ్' అనే పదాన్ని హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు తమ సైన్‌బోర్డుల నుంచి తొలగించాలని అన్నారు.

Updated Date - 2022-07-15T22:15:50+05:30 IST