ఆ దమ్ముందా?: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్

Published: Wed, 23 Mar 2022 16:27:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ దమ్ముందా?: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ పోల్స్ షెడ్యూల్‌ వాయిదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే ఆ పార్టీ (బీజేపీ)  ఆమ్ ఆద్మీ  పార్టీ వంటి చిన్న పార్టీని చూసి భయంతో పారిపోతోందంటూ విమర్శించారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను (నార్త్, ఈస్ట్, సౌత్) విలీనం చేస్తూ కేంద్ర మంత్రి వర్గం ఒక బిల్లును మంగళవారం ఆమోదించడంతో కేజ్రీవాల్ ఈ కామెంట్లు చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం...

ఢిల్లీ అసెంబ్లీ బయట మీడియాతో కేజ్రీవాల్ బుధవారం మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం బీజేపీ ఎన్నికలు నిర్వహించి, గెలిస్తే తమ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ చేశారు. బీజేపీకి ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతం బీజేపీ అధీనంలో ఉన్నాయి. వీటి ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించేందుకు సిద్ధం కాగా, దీనికి కొద్ది సేపటికి ముందే బీజేపీ ఆ మూడు మున్సిపాలిటీలను ఏకం చేసే ఆలోచన ఉన్నట్టు ఈసీకి తెలిపిందని, దాంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదా పడిందని కేజ్రీవాల్ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఇన్నేళ్లూ కాలయాపన చేసి ఈసీ షెడ్యూల్ ప్రకటించే సమయానికి విలీనం ప్రస్తావన చేయడం ఏమిటని బీజేపీని ఆయన నిలదీశారు. ఆప్ చేతిలో ఓడిపోతామనే భయమే ఇందుకు కారణమన్నారు. 2017 ఎంసీడీ ఎన్నికల్లో (మూడు మున్పిపల్ కార్పొరేషన్లలో) బీజేపీ  270 సీట్లకు గాను 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 48 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 29 సీట్లతో మూడు స్థానంలో నిలిచింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.