Pollution Control: 150 Electric buses ప్రారంభించిన Kejriwal

ABN , First Publish Date - 2022-05-25T00:55:01+05:30 IST

దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ముందడుగు...

Pollution Control: 150 Electric buses ప్రారంభించిన Kejriwal

ఢిల్లీ: దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) మరో ముందడుగు వేశారు. 150 ఎలక్ట్రిక్ బస్సులను (Electric buses) మంగళవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు. ఏడాదిలో 2,000 ఎలక్ర్టానిక్ బస్సులు ప్రారంభించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే పదేళ్లలో ఎలక్ర్టిక్ బస్సుల సేకరణ కోసం రూ.1,862 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కేంద్రం రూ.150 కోట్లు సమకూరుస్తుందని చెప్పారు.


''ఇవాళ 150 బస్సులు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో 150 బస్సులు వచ్చి చేరుతాయి. ఇవి మన బస్సులు. జాగ్రత్తగా చూసుకోండి. మురికిగా మార్చొద్దు. ఈ బస్సులతో ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పడుతుంది'' అని మీడియాతో మాట్లాడుతూ  ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఫండ్‌‌పై మాట్లాడుతూ, కేంద్రానికి తాము కృతజ్ఞతలు చెబుతున్నామని, వారికి ఆ క్రెడిట్ ఇస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్ బస్సుల పనులు ఢిల్లీలోనే జరుగుతాయని చెప్పారు. ఢిల్లీ చరిత్రలోనే దేశరాజధానిలో తొలిసారి 7,200 బస్సులు నడుస్తున్నాయని, ఎలక్ట్రానిక్ బస్సుల తయారీకి ఎక్కువ సమయం పట్టేందుకు అవకాశాలున్నందున 600 నుంచి 700 సీఎన్‌జీ బస్సుల సేకరణకు కూడా ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.


కాగా, ఇంద్రప్రస్థ డిపో నుంచి ఎలక్ట్రానిక్ బస్సులను కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం రాజ్‌ఘాట్ క్లస్టర్ బస్సు డిపో వరకూ వెళ్లే ఒక బస్సులో ప్రయాణించారు. ఆయన వెంట ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ కూడా ప్రయాణించారు. 

Updated Date - 2022-05-25T00:55:01+05:30 IST