ఒకేరోజు ఆర్య రెండు చిత్రాలు విడుదల

Sep 18 2021 @ 12:47PM

టాలెంటెడ్ హీరో ఆర్య..  లాక్ డౌన్ కాలంలో  ‘టెడ్డీ, సార్పాట్టా పరంపరై’ సినిమాలతో ఓటీటీలో వరుస విజయాలు అందుకున్నాడు. ఆ రెండింటితో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు.  ఈ హీరో ఇప్పుడు  కోలీవుడ్ లో ఓ అరుదైన ఫీట్ కు సిద్ధమవుతున్నాడు. ఒకేరోజు తను నటించిన రెండు సినిమాల్ని విడుదల చేస్తుండడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒకటి ‘ఎనిమీ’ అయితే.. మరొకటి ‘అరణ్మణై 3’. విశాల్ హీరోగా నటిస్తున్న ‘ఎనిమీ’లో ఆర్య విలన్ గా అలరించబోతున్నాడు. ఈ సినిమా విజయదశమి కానుకగా విడుదల కానుండగా..  ‘అరణ్మణై 3’ కూడా అదేరోజు విడుదల కానుండడం ఆసక్తిగా మారింది. 



నిజానికి కోలీవుడ్ లో ఒకే రోజు ఏ హీరో కూడా రెండు సినిమాల్ని విడుదల చేయకూడదనే రూల్ ఉంది. అయితే ఇక్కడో లాజిక్ ను తెరపైకి తెచ్చారు. ఎనిమీ సినిమాలో ఆర్య హీరో కాదు. విలన్ అని గుర్తు చేస్తున్నారు. ఇక ‘అరణ్మణై 3’ విషయానికొస్తే .. ఈ సినిమా హక్కుల్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్  సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా విడుదల ఖాయం అనిపిస్తోంది. ఈ కారణాల వల్లనే ఆర్య నటించిన రెండు సినిమాలు విజయదశమికి సందడి చేయబోతున్నాయి. ఈ రెండూ కూడా విజయం సాధిస్తే.. కరోనా పాండమిక్ టైమ్ లో నాలుగు సినిమాల్ని విడుదల చేసిన ఏకైక హీరోగా ఆర్య నిలుస్తాడు. మరి ఈ రెండూ అంచనాల్ని ఏ మేరకు అందుకుంటాయో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.