తెలుగులో ఆర్య!

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

డిస్నీ-హాట్‌స్టార్‌లో విడుదలయి విజయం సాధించిన ‘ఆర్యా’ వెబ్‌సిరీస్‌ ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది. విజయవంతమైన హిందీ, ఇంగ్లీషు వెబ్‌సిరీ్‌సలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ మధ్య తెలుగులోకి డబ్‌ చేయడం పరిపాటిగా మారింది.

తెలుగులో ఆర్య!

డిస్నీ-హాట్‌స్టార్‌లో విడుదలయి విజయం సాధించిన ‘ఆర్యా’ వెబ్‌సిరీస్‌ ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది. విజయవంతమైన హిందీ, ఇంగ్లీషు వెబ్‌సిరీ్‌సలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ మధ్య తెలుగులోకి డబ్‌ చేయడం పరిపాటిగా మారింది. ఈ మార్గంలోనే ఆర్యను కూడా తెలుగులోకి డబ్‌ చేశారు. ఒకప్పటి విశ్వ సుందరి సుస్మితా సేన్‌, బాలీవుడ్‌ నటుడు చంద్రచూర్‌ సింగ్‌లు నటించిన ఈ వెబ్‌సిరిస్‌ కథ నేపథ్యమంతా రాజస్థాన్‌లో డ్రగ్‌ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఆర్యయ (సుస్మితాసేన్‌) భర్త తేజ్‌ (చంద్రచూర్‌ సింగ్‌) ఒక పార్మాకంపెనీ ముసుగులో డ్రగ్‌ రాకెట్‌ నడుపుతూ ఉంటాడు. ఆర్య ఒత్తిడిపై ఈ రాకెట్‌ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటాడు. కానీ ఈ లోపులోనే ప్రత్యర్థులు అతనిని హతమారుస్తారు. తేజ్‌ తమకు ఇవ్వాల్సిన డబ్బు, డ్రగ్స్‌ను వెంటనే ఇవ్వకపోతే మొత్తం కుటుంబాన్నే చంపేస్తామని ఆర్యను బెదిరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని ఆర్య ఎలా రక్షించుకుందనేదే కథ. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమయిన డచ్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘పినోజా’ ఆధారంగా దీనిని నిర్మించారు.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST