జైలులో సీతారాముల పుస్తకాలు చదువుతున్న ఆర్యన్

ABN , First Publish Date - 2021-10-24T21:43:30+05:30 IST

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తనకు కావలసిన పుస్తకాలను

జైలులో సీతారాముల పుస్తకాలు చదువుతున్న ఆర్యన్

ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తనకు కావలసిన పుస్తకాలను జైలు లైబ్రరీ నుంచి తెప్పించుకుని చదువుతున్నాడు. గత రెండ్రోజులుగా సీతాదేవి, రాముడి పుస్తకాలను చదువుతున్నాడు. ఆర్యన్ ఖాన్ గత గురువారంనాడు బెయిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే, అతని జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 30వ తేదీ వరకూ ముంబై స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కోర్టు పొడిగించింది. ఈ క్రమంలోనే పుస్తకాలు చదవాల్సిందిగా ఆధికారులు సూచించడం, జైలు లైబ్రరీ నుంచి పుస్తకాలు అందించడం జరిగింది. దీనికి ముందు 'ది లయన్స్ గేట్' అనే పుస్తకాన్ని ఆర్యన్ తెప్పించుకుని చదివాడు.


జైలు మాన్యువల్ ప్రకారం, జైలులో ఉండే వ్యక్తి తాను కోరిన పుస్తకాన్ని బంధువుల నుంచి తెప్పించుకోవచ్చు. అయితే, రెలిజియస్ పుస్తకాలను మాత్రమే అనుమతిస్తారు. అతను జైలును విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఆ పుస్తకం కూడా వదిలిపెట్టాలి. దానిని లైబ్రరీలో జమ చేస్తారు. కాగా,  ఆర్యన్‌కు, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంపై ఆర్యన్ ఖాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. ఈనెల 26న దీనిపై కోర్టు విచారణ జరుపనుంది.

Updated Date - 2021-10-24T21:43:30+05:30 IST