వెయ్యి కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Sep 15 2021 @ 00:33AM

సత్తుపల్లిరూరల్‌, సెప్టెంబరు 14: రూ.1000కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మునగాల కాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో కార్పొరేషన్‌ ఏర్పాటుతో పేద ఆర్యవైశ్యులకు చేయూత అందుతుందన్నారు. ఆక్టోబర్‌ 3న జిల్లా కేంద్రంలో జరిగే ఆర్యవైశ్య మహాసభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ కుంచం కృష్ణారావు, పట్టణ, మండల అధ్యక్షులు వనమా వాసు, నడిపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్‌ కొత్తూరు ఉమ, సంఘ బాధ్యులు గుడిమెట్ల గాంధీ, మల్లూరు అంకంరాజు, గుండు ఉమా, ఏపూరి పురుషోత్తం, వందనపు సత్యనారాయణ,  కొత్తూరు కోటేశ్వరరావు, గంగిశెట్టి ప్రసాద్‌, సత్తిబాబు, సత్యనారాయణ, పొలిశెట్టి శివకుమార్‌ పాల్గొన్నారు.

Follow Us on: