ఈ రెండు చెట్ల వెనుక పెద్ద కథే ఉందిగా..!

Published: Mon, 15 Aug 2022 02:40:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ రెండు చెట్ల వెనుక పెద్ద కథే ఉందిగా..!

స్వాతంత్ర్యానికి గుర్తుగా..

ఈ రావిచెట్లకు 75 ఏళ్లు 


ఐరాల, ఆగస్టు: ఐరాల మండల వేదగిరివారిపల్లెలోని ఈ రెండు రావిచెట్లకు 75 సంవత్సరాలు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున ఇక్కడి పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు మునస్వామి నాయుడు ఈ రావి మొక్కలను నాటారు. స్వాతంత్య్రం వచ్చిన రోజుకు గుర్తుగా నాటి ఈ మొక్కలు.. నేడు పెద్ద వృక్షాలుగా మారాయి. ఈ రావిచెట్ల వద్ద సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ పాఠశాలలో చదివి.. 75 ఏళ్ల వయసు కలిగిన వారిని సన్మానిస్తామని పేర్కొన్నారు. ఈ చెట్లు తమ గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.