పండక్కి తీపి కబురు లేనట్లే

ABN , First Publish Date - 2021-10-04T05:47:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి వాహనాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపట్టారు. అయితే దసరాగా పండగ సందర్భంగా పేదలకు కేవలం బియ్యం, కందిపప్పు తప్ప చాలా గ్రామాల్లో పంచదార ఇవ్వడం లేదు. అక్కడక్కడా కొన్ని మండలాలు, ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది.

పండక్కి తీపి కబురు లేనట్లే

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 3: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి వాహనాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపట్టారు. అయితే దసరాగా పండగ సందర్భంగా పేదలకు కేవలం బియ్యం, కందిపప్పు తప్ప చాలా గ్రామాల్లో పంచదార ఇవ్వడం లేదు. అక్కడక్కడా కొన్ని మండలాలు, ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాకు తక్కువగా పంచదార కోటా సరఫరా చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 11.63లక్షల బియ్యంకార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా అరకిలో, అంత్యోదయ కార్డులకు కిలో వంతున పంచదారను రాయితీపై అందిస్తున్నారు. ఈ మేరకు జిల్లాకు 650 మెట్రిక్‌ టన్నుల పంచదార అవసరం. అయితే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా కాగా జిల్లాలో అక్కడక్కడ సర్దుబాటు చేశారు. అక్టోబరు నెలకు సంబంధించి శుక్రవారానికి 400 టన్నుల పంచదార మాత్రమే చేరింది. ఈ విషయమై పౌరసరఫరాల అధికారులను ప్రశ్నించగా మౌనం వహిస్తున్నారు. 

Updated Date - 2021-10-04T05:47:31+05:30 IST