యథాతథం..!

Published: Sun, 27 Mar 2022 00:20:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యథాతథం..!

జిల్లాల పునర్విభజనలో భౌగోళిక మార్పుల్లేవ్‌

పేర్లు కూడా అవే..

గన్నవరం, పెనమలూరు కృష్ణాలోనే.. 

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పేరుతో సరి

నూజివీడు, కైకలూరులు ఏలూరులోకే..

మైలవరం రెవెన్యూ డివిజన్‌  లేనట్టే.. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లా పునర్విభజన తుది నోటిఫికేషన్‌లో ఎలాంటి మార్పులూ లేవనే అనిపిస్తోంది. కొత్త ఎన్టీఆర్‌ విజయవాడ, కృష్ణాజిల్లాలకు సంబంధించి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారమే అంతా జరుగుతోందని తెలిసింది. విజయవాడను ఆనుకుని ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోకి  తీసుకునే అవకాశాల్లేవని తెలిసింది. ఈ రెండింటి విలీనం అసాధ్యమని రాష్ట్ర ప్రణాళిక శాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను కొనసాగించాలన్న ప్రతిపాదనలు కూడా బుట్టదాఖలే అయ్యాయని తెలిసింది. అయితే, కొత్తగా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, మైలవరం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ప్రణాళిక శాఖ ఆసక్తి చూపట్లేదని సమాచారం.

నిర్ణయాలు వద్దు.. అభిప్రాయాలే చెప్పండి

రాష్ట్ర ప్రణాళిక శాఖ వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలకు సంబంధించిన అంశాలపై జిల్లా యంత్రాంగాల నోరు నొక్కేసింది. ప్రజల నుంచి ఎన్టీఆర్‌ విజయవాడ, కృష్ణాజిల్లాలకు సంబంధించి దాదాపు 2,800 అభ్యంతరాలు వచ్చాయి. వీటికి సంబంధించి సమీక్షించిన తరువాత జిల్లా అధికారులు నిర్ణయాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆదేశించింది. కేవలం వాటికి సంబంధించిన అభిప్రాయాలను మాత్రమే తెలపాలని సూచించింది. దీంతో జిల్లా నుంచి వచ్చిన భౌగోళిక, పేర్ల మార్పులు యథాతథంగానే ఉంటాయని తెలుస్తోంది. 

ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లా.. జిల్లా కేంద్రం : విజయవాడ 

రెవెన్యూ డివిజన్లు : నందిగామ (కొత్తది), తిరువూరు (కొత్తది), విజయవాడ (పాతది) 

నందిగామ రెవెన్యూ డివిజన్‌ మండలాలు : నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు

తిరువూరు రెవెన్యూ డివిజన్‌ మండలాలు : మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు 

విజయవాడ  రెవెన్యూ డివిజన్‌ మండలాలు : ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌, విజయవాడ వెస్ట్‌, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ నార్త్‌, విజయవాడ ఈస్ట్‌ 


కృష్ణాజిల్లా ... జిల్లా కేంద్రం : మచిలీపట్నం 

రెవెన్యూ డివిజన్లు : మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు (కొత్త ప్రతిపాదన ) 

మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌ మండలాలు : పెడన , గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, మొవ్వ 

గుడివాడ రెవెన్యూ డివిజన్‌ మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు 

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ మండలాలు (ఏర్పాటు చేస్తే) : గన్నవరం, పెన మలూరు, బాపులపాడు, ఉంగుటూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.