Top 10 Busiest International Routes: తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే ఈ లిస్ట్‌ తెలుసుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2022-09-13T16:56:37+05:30 IST

కరోనా కారణంగా భారీగా నష్టపోయిన రంగాలలో విమానయానం కూడా ఉంది.

Top 10 Busiest International Routes: తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే ఈ లిస్ట్‌ తెలుసుకోవాల్సిందే..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా భారీగా నష్టపోయిన రంగాలలో విమానయానం కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలతో పాటు విమానయానం కూడా కోలుకుంటోంది. దీంతో గతకొంతకాలంగా విమానయన రంగం మునుపటి శోభను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్నెషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) వరల్డ్ వైడ్‌గా అత్యంత రద్దీగా ఉండే రూట్ల వివరాలను వెల్లడించింది. దీనిలో భాగంగా 2022 ఆగస్టు నెల ట్రాఫిక్ డేటా ఆధారంగా ముంబై-దుబాయ్ రూట్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో టాప్-6లో నిలిచింది. అలాగే న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టు అని ఐఏటీఏ డేటా వెల్లడించింది. అలాగే అత్యంత రద్దీ గమ్యస్థానంగా దుబాయ్ నిలిచింది. ఇక ఇటీవల వెల్లడైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల డేటా ఆధారంగా ఈ ఎయిర్‌పోర్టుకు ఎక్కువగా రాకపోకలు సాగించింది కూడా భారతీయ ప్రయాణికులేనని తేలింది.


మనోళ్ల తొలి ప్రాధాన్యం దుబాయ్..

భారతీయులు ఉపాధి, ఉద్యోగం, విరహార యాత్రలు ఇలా ఏదైనా సరై తొలి ప్రాధాన్యమిచ్చేది దుబాయ్‌కే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. 1) దుబాయ్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోనే మనోళ్లు అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. దీంతో సాధారణంగానే ఇతర అంతర్జాతీయ రూట్లతో పోలిస్తే దుబాయ్-భారత్ రూట్‌లో అధిక ప్రయాణాలు జరుగుతుంటాయి. దాంతో ఈ రూట్ బిజీగా మారుతుంది. 2. దుబాయ్ కేంద్రంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులు భారీగా ఉండడంతో ఇక్కడి నుంచి భారత ప్రవాసులతో పాటు ఇతర దేశాల వారికి జర్నీ సులభతరం అవుతోంది. ముఖ్యంగా యూరోప్ దేశాలతో పాటు అమెరికాకు చాలా సులువు అవుతోంది. 


దుబాయ్‌కు విరివిగా భారతీయ ఎయిర్‌లైన్ల విమానాలు..

పాత సర్వీసులతో పాటు ఇటీవల చాలా ఇండియన్ విమానయాన సంస్థలు ఇండియా-దుబాయ్ రూట్‌లో విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. వీటిలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, విస్తారా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ ఎయిర్‌లైన్లు ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ కూడా ఈ రూట్‌లో విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. వీటిలో పెద్ద విమానాలు ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్ బస్ 380, బోయింగ్ 777 ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8, ఇతర విమానయాన సంస్థలకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్, ఎయిర్ బస్ ఏ320 విమాన సర్వీసులు ఉన్నాయి. ఇక తాజాగా ఇంటర్నెషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా ఉండే రూట్ల వివరాల ప్రకారం..


అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 అంతర్జాతీయ విమాన మార్గాలివే..

1. Kuala Lumpur (KUL) to Singapore (SIN)

2. Cairo (CAI) to Jeddah (JED)

3. Dubai (DXB) to Riyadh (RUH)

4. Antalya (AYT) to Moscow/Vnukovo (VKO)

5. New York/JFK (JFK) to London/Heathrow (LHR)

6. Mumbai (BOM) to Dubai (DXB)

7. Dubai (DXB) to London/Heathrow (LHR)

8. Manila (MNL) to Singapore (SIN)

9. Hong Kong (HKG) to Taipei (TPE)

10. Bangkok (BKK) to Singapore (SIN) 

Updated Date - 2022-09-13T16:56:37+05:30 IST