సల్మాన్‌ లవర్‌గా...

ABN , First Publish Date - 2021-01-24T06:44:43+05:30 IST

అందచందాలకు కొదవ లేకపోయినా అవకాశాల వేటలో వెనుకబడ్డారు కథానాయిక ప్రగ్యాజైశ్వాల్‌. అయితే ఇప్పుడామె సినీ కెరీర్‌ను మలుపు తిప్పే ఓ అరుదైన అవకాశం దక్కించుకున్నారని టాక్‌.

సల్మాన్‌ లవర్‌గా...

అందచందాలకు కొదవ లేకపోయినా అవకాశాల వేటలో వెనుకబడ్డారు కథానాయిక ప్రగ్యాజైశ్వాల్‌. అయితే ఇప్పుడామె సినీ కెరీర్‌ను మలుపు తిప్పే ఓ అరుదైన అవకాశం దక్కించుకున్నారని టాక్‌. ఏకంగా బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించే అవకాశం దక్కించున్నారని సమాచారం. ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందులో ప్రగ్యా, సల్మాన్‌తో జోడీ కట్టబోతున్నారు. ఇప్పటికే ఆమె సల్మాన్‌తో కలసి షూటింగ్‌లో పాల్గొన్నారని, వారిద్దరిపై ఓ పాటను కూడా చిత్రీకరించారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. ఈ చిత్రానికి మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2021-01-24T06:44:43+05:30 IST