ఆస్పత్రిలో మహిళల ప్రసవం.. అంతలోనే అనూహ్య ఘటన.. నా పిల్లలు కాదంటే నా పిల్లలు కాదంటూ.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-10T00:27:53+05:30 IST

ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో ప్రసవించారు. అయితే కాసేపటికే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులు.. పిల్లలు తమ వారు కాదంటే తమ వారు కాదంటూ వాగ్వాదం..

ఆస్పత్రిలో మహిళల ప్రసవం.. అంతలోనే అనూహ్య ఘటన.. నా పిల్లలు కాదంటే నా పిల్లలు కాదంటూ.. చివరకు..

ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో ప్రసవించారు. అయితే కాసేపటికే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులు.. పిల్లలు తమ వారు కాదంటే తమ వారు కాదంటూ వాగ్వాదం చేసుకున్నారు. తమ పాపను తమకు ఇవ్వాలని గొడవపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు అధికారులు జోక్యం చేసుకుని శిశువుల రక్త నమూనాలను పరిశీలించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు DNA పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  సెప్టెంబర్ 1న ఇద్దరు గర్భిణులు ఆస్పత్రిలో ప్రసవించారు. అయితే కాసేపటికి ఓ మహిళ.. తనకు పుట్టింది మగ బిడ్డ కాదని, ఆడ పిల్ల అంటూ సిబ్బందితో గొడవ పడింది. శిశువుల విషయంలో ఇద్దరు తల్లుల మధ్య గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడంతో చివరకు అధికారులు జోక్యం చేసుకున్నారు. శిశువుల రక్త నమూనాలను సేకరించి, తల్లిదండ్రుల రక్త నమూనాలతో సరి చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు శిశువుల తల్లిదండ్రులను గుర్తించేందుకు.. DNA పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత.. ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది..!


శిశువులు మారిపోయారనే వార్త తెలియడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబరు 3న ఇద్దరు మహిళల శిశువులను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వారిని నర్సుల పర్యవేక్షణలో ఉంచారు. DNA పరీక్షల ఫలితాలు రాగానే.. వారి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, ఎవరో కావాలనే శిశువులు మార్చి ఉంటారని, లేదా శిశువులను విక్రయించే రాకెట్ పని అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సైలెంట్‌గా ఇంట్లోకి దూరిన దొంగ.. చివరకు అతడు ఎత్తుకెళ్లిన వస్తువులను.. సీసీ కెమెరాలో చూసి అంతా షాక్..



Updated Date - 2022-09-10T00:27:53+05:30 IST