పుతిన్ ఆరోగ్యంపై వదంతులు.. ఆ రిపోర్టులు నిజమేనా..

ABN , First Publish Date - 2022-04-28T01:19:55+05:30 IST

మాస్కో : ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో Russian President Vladimir Putin వ్యక్తిగత జీవితాంశాలపై ప్రాధాన్యత నెలకొన్న నేపథ్యంలో ఆసక్తికరమైన ఓ అంశం చర్చకు వచ్చింది. పుతిన్ ఆరోగ్యం ఆరోగ్యంలేరంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పుతిన్ ఆరోగ్యంపై వదంతులు.. ఆ రిపోర్టులు నిజమేనా..

మాస్కో : ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో Russian President Vladimir Putin వ్యక్తిగత జీవితాంశాలకు ప్రాధాన్యత నెలకొన్న నేపథ్యంలో ఆసక్తికరమైన ఓ అంశం చర్చకు వచ్చింది. పుతిన్ ఆరోగ్యంగా లేరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాలో ఇటివల జనాలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాల్లో పుతిన్ నడవడిక, వైఖరిని బట్టి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పుతిన్ చేతులు వణుకుతుండడంతోపాటు ఆయన ముఖం కాస్మోటిక్ సర్జరీ చేసినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. పలు వీడియోలను పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చామని చెబుతున్నారు.


సిడ్నీలో నివాసముంటున్న ఓ కాస్మోటిక్ డాక్టర్.. పుతిన్‌ పాత ఫొటో, కొత్త ఫొటో రెంటింటినీ జతగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. పుతిన్ నిండుగా ఉన్నప్పుడు.. ముసలి పిల్లిలా ఉన్నప్పుడు అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ రెండు ఫొటోల్లో పాత దాంట్లో పుతిన్ ముఖం ముడతలుగా కనిపించగా.. ఇటివలి ఫొటోలో ఆయన యంగ్‌గా కనిపిస్తున్నారు. న్యూస్‌డాట్‌కామ్ రిపోర్ట్ ప్రకారం.. పుతిన్‌ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారని గత కొన్నేళ్లుగా వదంతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కణతల ముడుతలు, చెంపల ముడుతలతోపాటు గడ్డం, కనురెప్పలకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారని అంటోంది. గట్టి మనిషిననే పబ్లిసిటీతోపాటు వయసు కనబడనీయకుండా పుతిన్ ఈ సర్జరీలు చేయించుకున్నారని న్యూస్‌డాట్‌కామ్ పేర్కొంది. 


ఇక న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే తరహా ఓ కథనాన్ని రిపోర్ట్ చేసింది. రష్యా ఒలింపిక్ అథ్లెట్లను సన్మానించినప్పుడు ఆయన పొట్ట చాలా ఉబ్బినట్టుగా, ఆయన ఇబ్బందిపడినట్టుగా కనిపించిందని పేర్కొంది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో భేటీలో పుతిన్ సపోర్ట్ కోసం టేబుల్ గట్టిగా పట్టుకున్నట్టు కనిపించారని న్యూస్‌వీక్ పేర్కొంది. చేతులు వణుకుతున్నాయని మరో సందర్భాన్ని ప్రస్తావించింది. దీంతో అనేక మంది ట్విట్టర్ యూజర్లు పుతిన్ పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని అంటున్నారు. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే పార్కిన్‌సన్స్ వ్యాధి మనిషి కదలికలను ప్రభావితం చేస్తుంది. ఇయాన్ బ్రీమర్ ఓ ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. నియంతలు నిరంకుశంగా ఉండొచ్చు. వారి వైఖరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకోవచ్చు. కానీ వారు బలహీనంగా ఉండకూడదు. పుతిన్‌ ఏదో తీవ్రమైన సమస్యేతోనే బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే పుతిన్ అనారోగ్యం వదంతులపై స్పందించేందుకు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నిరాకరించింది. 

Updated Date - 2022-04-28T01:19:55+05:30 IST