ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు లేదు: మజ్లిస్‌

ABN , First Publish Date - 2021-07-26T08:21:48+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి ఎన్నికల పొత్తులేదని మజ్లిస్‌ పార్టీ స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో  సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు లేదు: మజ్లిస్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి ఎన్నికల పొత్తులేదని మజ్లిస్‌ పార్టీ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లకు పోటీ చేస్తుందని పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించిన విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు షౌకత్‌ అలీ గుర్తు చేశారు. యూపీలో అధికారంలోకి వస్తే  సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా ముస్లింను నియమించడానికి అంగీకరించిన పక్షంలో ఆ పార్టీతో పొత్తుకు మజ్లిస్‌ అంగీకరిస్తుందని వచ్చిన వార్తల్లో నిజంలేదని షౌకత్‌ అలీ స్పష్టం చేశారు.  

Updated Date - 2021-07-26T08:21:48+05:30 IST