AP News: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ‘అసాని’ తుఫాన్ ప్రభావం

ABN , First Publish Date - 2022-05-09T23:12:31+05:30 IST

AP News: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ‘అసాని’ తుఫాన్ ప్రభావం

AP News: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ‘అసాని’ తుఫాన్ ప్రభావం

కాకినాడ: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై అసాని తుఫాన్ ప్రభావం పడుతోంది. తుఫాను కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాలో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి అక్కడక్కడా వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1060 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా బలపడి వాయువ్య దిశలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. ఈ నెల 10వతేదీ సాయంత్రానికి ఆంధ్రా-ఒడిశా తీరానికి చేరవగా వచ్చి ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్‌ వైపు మరలనుందన్నారు. ఎగసిపడే కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. తుఫాన్‌ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలోని మత్స్యకారులు ఎవరూ వేటకు సముద్రంలోకి వెళ్లరాదన్నారు.

Read more