తెలంగాణలో ఆసరా పెన్షన్లు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-26T05:23:33+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షే మ పథకాలు, ఆసరా పెన్షన్లు దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

తెలంగాణలో ఆసరా పెన్షన్లు దేశానికే ఆదర్శం
మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్న కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జూలపల్లి, సెప్టెంబర్‌ 25 : రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షే మ పథకాలు, ఆసరా పెన్షన్లు దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మండలంలోని అబ్బాపూర్‌లో ఆదివారం నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల మంజూరుపత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. అలాగే మహిళలకు బతుకమ్మ చీర లను పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామంలో రెడ్డి, ముదిరాజ్‌ల కుల సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో ప్రభుత్వం అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే ఓర్వ లేని కేంద్రం ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దేశం లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్లా రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీన ర్సయ్య, గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, తహసీల్దార్‌ అబుబాకర్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దారబోయిన నర్సింహయాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, సింగిల్‌ విండోచైర్మన్‌ పుల్లూరి వేణుగోపాల్‌రావు, సర్పంచ్‌ బంటు ఎల్ల య్య, నాయకులు రాంగోపాల్‌రెడ్డి, శ్యాం, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T05:23:33+05:30 IST