అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాఫూలే

ABN , First Publish Date - 2021-04-12T06:30:22+05:30 IST

జడ్పీ కార్యాలయంలో జరిగిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకలకు జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత హాజరై ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాఫూలే
జగిత్యాలలో మహాత్మ జ్యోతిబాఫూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

- జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత 

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 11: జడ్పీ కార్యాలయంలో జరిగిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకలకు జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత హాజరై ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనాథ్‌రావు, డిప్యూటీ సీఈవో సంధ్యారాణి తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎస్పీ సింధు శర్మ, ఏఆర్‌ డీఎస్పీ ప్రతాప్‌, ఆర్‌ఐ వామన మూర్తి తదితరులు ఉన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న, నిజామాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు యాధాగౌడ్‌, గోపాల్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి సురేందర్‌రెడ్డి, అక్కినపెల్లి కాశీనాథం, సర్వేశ్వర్‌ ఉన్నారు.

ఫ జగిత్యాల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని బీసీ వెల్ఫేర్‌ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్‌ రవి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, బల్దియా ఛైర్‌పర్సన్‌ శ్రావణిలు   పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్‌సీ వెల్ఫేర్‌ అధికారులు సాయి బాబా,  రాజ్‌కుమార్‌, డీబ్ల్యూవో నరేష్‌, బాలె శంకర్‌ ఉన్నారు.  అలాగే పట్టణంలోని స్థానిక తహసీల్‌ చౌరస్తా వద్ద తెలంగాణ మాల మహానాడు, మాల మహానాడు సంఘాల జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్‌, మ్యాదరి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు నర్ర రాజేందర్‌, బండ శంకర్‌, బొల్లం విజయ్‌, నారాయణ, ప్రవీణ్‌, లక్ష్మీనారాయణ, రాజేష్‌ ప్రవీణ్‌ ఉన్నారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా బాధ్యులు చిర్ర శంకర్‌, లక్ష్మణ్‌, సురేందర్‌, సాదుల్లా, శ్రీనివాస్‌, ప్రభా కర్‌, నాగరాజు, శంకర్‌, రమేష్‌, చరణ్‌ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు,  రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, విద్యార్థి సంఘ నాయకుడు జాజాల రమేష్‌ ఆధ్వర్యంలో  జరిగిన వేడుకల్లో సతీష్‌, కిషన్‌, భార్గవ్‌,  నాగరాజు, సత్యనారాయణ, మహేందర్‌ తదితరులున్నారు. జిల్లా ముదిరాజ్‌ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘ బాధ్యులు రాజేష్‌, రమణ, విజయ్‌, అరుణ్‌, తిరుపతి, సత్యం, శ్రీనివాస్‌, నర్సయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.    


Updated Date - 2021-04-12T06:30:22+05:30 IST