వైభవంగా ఆషాఢ కృత్తిక మహోత్సవం

ABN , First Publish Date - 2021-08-03T07:06:51+05:30 IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ కృత్తి మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది.

వైభవంగా ఆషాఢ కృత్తిక మహోత్సవం

మోపిదేవి, ఆగస్టు 2 : సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ కృత్తి మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం ఆడికృత్తికను పురస్కరించుకుని ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు దంపతులు స్వామి వారిని దర్శించుకుని కృత్తిక మహోత్సవాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తీర్థపు బిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వరపూజ, వల్లీదేవసేన అమ్మ వార్లకు వివిధ రకాల పూలు, పండ ్లతో శాకంబరీ అలంకరణ గావించారు.  ఈవో జి.వి.డిఎన్‌. లీలాకుమార్‌ ఆధ్వర్యంలో 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం, చతుర్వేద పండితులు, 11 మంది రుత్వికులచే మహాన్యాస పారాయణం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.  పూలకావిడి, పాలకావిడి, వేలాయుధం ఉత్సవం గుంటూరుకు చెందిన మూర్తి, మణికంఠ స్వామి ఆధ్వర్యంలో రావూరు సురేష్‌ శర్మ నేతృత్వంలో బ్రహ్మోత్సవాన్ని కన్నుల విందుగా నిర్వహి ంచారు. ఎమ్మెల్యే రమే్‌షబాబు దంపతులు పూలకావిడి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎస్టేట్‌ దేవాలయాల పర్యవేక్షకులు మధుసూదనరావు, చెన్నకేశవ, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లు పర్యవేక్షించగా, ప్రధాన అర్చకులు బుద్ధు పవన్‌ కుమార శర్మ, వేదపండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, యాజ్ఞిక బ్రహ్మ కొమ్మూరి ఫణిశర్మ ఆధ్వర్యంలో ఆడికృత్తిక మహోత్సవం కన్నుల పండువుగా జరిపారు. అనంతరం స్వామి వారికి లక్ష బిల్వార్చన, శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు.  

Updated Date - 2021-08-03T07:06:51+05:30 IST