Ashadha Bonalu: బోనమెత్తిన వైఎస్ షర్మిల..

ABN , First Publish Date - 2022-07-24T19:47:16+05:30 IST

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి.

Ashadha Bonalu: బోనమెత్తిన వైఎస్ షర్మిల..

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana) సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాలు (Ashadha Bonalu) వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) బంగారు బోనమెత్తుకున్నారు. అయితే ఆమె ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోలేదు. కేవలం ఆలయం వరకే వచ్చి.. తనతోపాటు తీసుకువచ్చిన బోనాలను లోపలికి పంపించి.. అక్కడకు వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోయారు.


చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.  ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మీ, గౌలిపురా కోటమైసమ్మ, ఆలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ దూద్‌బౌలి పయనీర్‌ ముత్యాలమ్మ, మీర్‌ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, ప్రధాన ఆలయాల్లో పట్టువస్త్రాలు సమర్పించారు. 

Updated Date - 2022-07-24T19:47:16+05:30 IST