విజయనగరం: టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు ప్రచార ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. అశోక్‌గజపతిరాజుపై ఓ మహిళ పూలు చల్లింది. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే తన కంటిపై పూలతో కొట్టారని సదరు మహిళపై ఆయన చేయి చేసుకున్నారు. నగరంలోని పూల్‌బాగ్‌లో టీడీపీ కార్యకర్తతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి వస్తున్న అశోక్‌గజపతిరాజుకు భారీ స్వాగత సన్నాహాకాలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. కొన్ని బంతిపూలు ఆయన కంటికి తగిలాయి. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. మహిళ తనపై కావాలనే పూలు చల్లిందని, ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయన చేయిచేసుకోవడంపై కార్యకర్తలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనపై అక్కడ ఉన్నవారేవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. పెద్దాయన బాధపడి ఇలా చేశారని కార్యకర్తలు అనుకున్నారు. అందరూ సానుకూలంగా ఉండడంతో ఈ వ్యవహారం కాసేపటికే సద్దుమణిగింది.