రూ 20 వేలతో ఉల్లి సాగు.. రూ. 2.5 లక్షల లాభం... ఆ రైతుకు ఇది ఎలా సాధ్యమయ్యిందంటే..

Published: Sat, 26 Mar 2022 09:19:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రూ 20 వేలతో ఉల్లి సాగు.. రూ. 2.5 లక్షల లాభం... ఆ రైతుకు ఇది ఎలా సాధ్యమయ్యిందంటే..

రైతులెవరైనా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తూ, ఎక్కువ లాభం పొందాలనుకుంటే, పంట, సాగుపద్ధతి.. రెండింటినీ మార్చాల్సివుంటుంది. దీనిని గుజరాత్‌లోని బనస్కాంత నివాసి అశోక్ రాజ్‌గోర్ నిరూపించాడు. ఈయన చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. మొదట్లో అధిక ఉత్పత్తికి రసాయన ఎరువులు వాడారు. అయినా కూడా పెద్దగా ఆదాయం రాలేదు. అయితే గతేడాది రూ. 20 వేల పెట్టుబడితో సహజసిద్ధమైన పద్ధతిలో ఉల్లిని సాగు చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది రూ.2.5 లక్షల లాభం వచ్చింది. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఇంతకు ముందు రసాయన ఎరువులు వాడేవాడిని. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే తగిన ఆదాయం రాలేదు. అంతేకాకుండా పొలం నాణ్యత కూడా దెబ్బతింది. ఈ నేపధ్యంలో తోటి రైతు జీతూ వేదాని కలిశాను. అతను చాలా కాలంగా సహజ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వదిలేసి సేంద్రియ వ్యవసాయం చేయమని ఆయన నాకు సూచించారు. సహజ వ్యవసాయంగా ఉల్లి పంటను ఎంచుకున్నానని అశోక్ చెప్పారు. ఎందుకంటే ఇది తక్కువ సమయంలో దిగుబడినిస్తుంది. ఉల్లి డిమాండ్ ఏడాది పొడవునా ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చు అవుతుంది. మొదటి సంవత్సరం ఉల్లి పండించాను. దాదాపు 10 వేల రూపాయలు ఖర్చయింది. పంట చేతికి వచ్చాక మార్కెట్‌కు తరలించడం ప్రారంభించాను. 

మొదటి సీజన్‌లో దాదాపు 55 వేల రూపాయల లాభం వచ్చింది. దీంతో వ్యవసాయ పరిధిని పెంచాను. గతేడాది డిసెంబరులో ఉల్లి సాగు చేశాను. దాదాపు 20 వేల రూపాయలు ఖర్చయ్యాయి. ఖర్చు తగ్గించుకోవడానికి రసాయన ఎరువులకు బదులు ఆవు పేడను ఎరువుగా వినియోగించారు. ఇప్పుడు ఉల్లి బాగా పండుతోంది. మార్కెట్‌, మండీల్లో మంచి ధర లభిస్తుంది. రూ. 2.5 లక్షల వరకు లాభం వచ్చింది. నా విజయాన్ని చూసి చుట్టుపక్కల చాలా మంది రైతులు సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు చేయడం ప్రారంభించారని అశోక్ చెప్పారు. 30 మంది రైతులకు శిక్షణ ఇచ్చానని ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉల్లిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఉల్లికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. దీనిని శీతాకాలం, వేసవి సీజన్లలో సాగు చేస్తారు. దీనికి ప్రత్యేకమైన మట్టి కూడా అవసరం లేదు. ఉల్లిని విత్తడానికి ముందు, దాని మొలకలను నర్సరీలో సిద్ధం చేయాలి. అలాగే పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. హెక్టారు ఉల్లి సాగుకు 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం. మూడు నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది, విత్తనం విత్తిన 45 రోజుల తర్వాత ఉల్లి మొక్క సిద్ధంగా ఉంటుంది. అనంతరం 4 నుండి 5 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటాలి. 4-5 రోజుల క్రమం తప్పకుండా నీటిని చల్లడం ద్వారా నీటిపారుదల చేయాలి. మూడు నాలుగు నెలల తర్వాత ఉల్లిపాయ మొక్కల ఆకులు ఎండిపోతాయి. ఇది పంట సిద్ధంగా ఉందనడానికి సంకేతం. దీని తరువాత ఉల్లిపాయలను వెలికితీయవచ్చు. నవంబర్‌లో ఉల్లిసాగు మొదలు పెడితే, మార్చి-ఏప్రిల్‌ నాటికి ఉల్లి పంట కోతకు సిద్ధం అవుతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.