10th ఉత్తీర్ణత ఎప్పుడూ లేని విధంగా దిగజారింది: Ashokbabu

ABN , First Publish Date - 2022-07-06T17:50:39+05:30 IST

క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టం రాష్ట్రంలో గతంలో మూడవ ర్యాంకులో ఉంటే.. దాన్ని ఇప్పుడు...

10th ఉత్తీర్ణత ఎప్పుడూ లేని విధంగా దిగజారింది: Ashokbabu

అమరావతి (Amaravathi): క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టం ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గతంలో మూడవ ర్యాంకు (Third rank)లో ఉంటే... దాన్ని ఇప్పుడు 19వ ర్యాంకు (19th rank)కు దిగజార్చారని టీడీపీ ఎమ్మెల్సీ (TDP MLC) పర్చూరి అశోక్ బాబు (Ashokbabu) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణత ఎప్పుడూ లేని విధంగా 67 శాతానికి దిగజారిందన్నారు. విద్యాకానుక టీడీపీ హయాంలో కూడా ఉందని, గతంలో కూడా విద్యార్థులకు డ్రస్సులు, బూట్లు, బుక్స్, బ్యాగులు, ఆడ పిల్లలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ప్రకటనలివ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మాతృభాషను వదిలేసి విద్యార్థులను ఇంగ్లీష్ భాషనే చదవమనడం అన్యాయమన్నారు.


గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు ఏడాదికి రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిందని అశోక్‌బాబు తెలిపారు. టీడీపీ ఐదేళ్లలో రూ. ఒక లక్షా 31 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ రూ. 53 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్, విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ, బెస్ట్ అవలబుల్ స్కూల్స్‌లను రద్దు చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎటుపోతోందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం ట్యాబులు ఇస్తామంటున్నారని విమర్శించారు. జగనన్న విద్యా కానుక పేరిట కేవలం హంగూ.. ఆర్భాటం మాత్రమేనని అశోక్ బాబు ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-07-06T17:50:39+05:30 IST