Ex Afghan president:అష్రఫ్ ఘనీ సోదరుడు తాలిబాన్లకు మద్దతు
ABN , First Publish Date - 2021-08-21T16:24:17+05:30 IST
అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్దతు ప్రకటించారని తాజా సమాచారం...
కాబూల్ : అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్దతు ప్రకటించారని తాజా సమాచారం. తాలిబాన్ నాయకుడు ఖలీల్ ఉర్ రెహ్మాన్, మత పండితుడు ముఫ్తీ మహమూద్ జాకీర్ ల సమక్షంలో గ్రాండ్ కౌన్సిల్ చీఫ్ హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్ ఉగ్రవాద గ్రూపునకు తన మద్దతును ప్రకటించారు. అఫ్ఘాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయి తన కుటుంబంతో సహా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థిరపడ్డారు.అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ ను కలిసిన తర్వాత తాలిబన్లకు తన మద్దతును ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు.