ఆసియాకప్‌ వాయిదా!

ABN , First Publish Date - 2021-03-01T09:46:56+05:30 IST

ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత జట్టు చోటు దక్కించుకుంటే ఆసియా కప్‌ను వాయిదా వేయక..

ఆసియాకప్‌ వాయిదా!

లాహోర్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత జట్టు చోటు దక్కించుకుంటే ఆసియా కప్‌ను వాయిదా వేయక తప్పదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి తెలిపాడు. ఈ రెండు టోర్నీలు జూన్‌లోనే ఉండడం దీనికి కారణం. ‘జూన్‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కూడా ఉండడంతో ఈసారి కూడా ఆసియా కప్‌ టోర్నీ సందేహమే. ఇక 2023లోనే ఆసియా కప్‌ను జరపాల్సి ఉంటుంది’ అని ఎహ్‌సాన్‌ మణి పేర్కొన్నాడు. వాస్తవానికి ఆసియాక్‌పనకు పాకిస్థాన్‌ జట్టు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా భారత్‌ అక్కడ పర్యటించలేదు కాబట్టి ఆతిథ్యానికి శ్రీలంక ముందుకు వచ్చింది.

Updated Date - 2021-03-01T09:46:56+05:30 IST