Asian Games వాయిదా.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులే కారణం..?

ABN , First Publish Date - 2022-05-06T20:27:22+05:30 IST

చైనాలోని హాంగ్‌జావ్ నగరంలో సెప్టెంబర్‌లో జరగాల్సిన 2022 ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ..

Asian Games వాయిదా.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులే కారణం..?

హాంగ్‌జావ్: చైనాలోని హాంగ్‌జావ్ నగరంలో సెప్టెంబర్‌లో జరగాల్సిన 2022 ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారంనాడు తెలిపారు. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే నిర్వాహకులు మాత్రం Asian games వాయిదాకు ఇతమిద్ధమైన కారణాన్ని ప్రకటించలేదు.


ఆసియా గేమ్స్ విషయంలో గతంలో నిర్వాహకులు ఒక ప్రకటన చేస్తూ, ఆసియా గేమ్స్, ఆసియా పారాగేమ్స్ కోసం హాంగ్‌జావ్‌లో 56 వేదికలను నిర్మించినట్టు చెప్పారు. హాంగ్‌జావ్ అక్కడి ప్రధాన నగరమైన షాంఘైకి దగ్గల్లో ఉంది. అక్కడ ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ లాక్‌డౌన్ అమలవుతోంది. 1990లో బీజింగ్, 2010లో గాంగ్‌జోవ్ తర్వాత కాంటినెంటల్ కాంపటీషన్‌కు ఆతిథ్యమిస్తున్న Chinaలోని మూడో నగరం హాంగ్‌జావ్ కానుండటం విశేషం.


సెప్టెంబర్ 10 నుంచి 25 వరకూ Hangzhouలో నిర్వహించ తలబెట్టిన 19వ ఆసియా గేమ్స్‌ను వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్స్ గేమ్స్ వెబ్‌సైట్ ఒక ప్రకటనలో తెలిపినట్టు చైనా స్టేట్ మీడియా తెలిపింది. రీషెడ్యూల్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Read more