Asia's Richest Woman : సంపన్న మహిళ ఆస్తి ఏడాదిలో రూ.95 వేల కోట్లు తరిగిపోయింది.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-07-29T01:33:04+05:30 IST

ఆసియా(Asia) సంపన్న మహిళ, చైనా(China) దేశస్థురాలు యంగ్ హుయన్(Yang Huiyan) సంపద విలువ ఏడాదిక్రితం 23.7 బిలియన్ డాలర్లుగా ఉండేది.

Asia's Richest Woman : సంపన్న మహిళ ఆస్తి ఏడాదిలో రూ.95 వేల కోట్లు తరిగిపోయింది.. కారణం ఇదే..

బీజింగ్ : ఆసియా(Asia) సంపన్న మహిళ, చైనా(China) దేశస్థురాలు యంగ్ హుయన్(Yang Huiyan) సంపద విలువ ఏడాదిక్రితం 23.7 బిలియన్ డాలర్లుగా ఉండేది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.80 లక్షల కోట్లన్నమాట. కానీ చైనా రియల్టీ సంక్షోభం కారణంగా ఏడాదిలో ఆమె సంపద సగం కరిగిపోయింది. ఏకంగా రూ.90 వేల కోట్ల మేర తరిగిపోయి ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఏడాది వ్యవధిలో యంగ్ హుయన్ ఆస్తుల విలువ ఏకంగా 52 శాతం మేర క్షీణించిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) గురువారం వెల్లడించింది. చైనాలో రియల్టీ సంక్షోభం ఇందుకు కారణమైంది. యంగ్ గుక్వియాంగ్ మెజారిటీ షేర్ హోల్డర్‌గా ఉన్న చైనా ప్రోపర్టీ దిగ్గజ కంపెనీ ‘కంట్రీ గార్డెన్’ (Country Garden) షేర్లు భారీగా పతనమవ్వడం ఇందుకు కారణంగా ఉంది. ఈ బుధవారం అత్యధికంగా 15 శాతం మేర షేర్లు దిగజారడంతో యంగ్ హుయంగ్‌కు భారీ నష్టం వాటిల్లింది. నిధుల సమీకరణ కోసం కొత్త షేర్లు విక్రయించనున్నట్టు ప్రకటించడం కంపెనీకి  ప్రతికూలమైంది. ఈ ప్రకటనే స్టాక్స్ప తనానికి దారితీసింది.


చేసిన అప్పులు చెల్లించలేక ఎవర్‌గ్రాండే, సునాక్ వంటి దిగ్గజ రియల్టీ కంపెనీలు విలవిల్లాడాయి. దివాళా తీసే అవకాశం ఉండడంతో రుణం కోసం బ్యాంకులను బతిమాలుకునే స్థితికి దిగజారాయి. నత్తకడక నిర్మాణాలు, ప్రోపర్టీలు అందించడం జాప్యంపై బయ్యర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణానికి ముందే పేమెంట్లు చేయడాన్ని కూడా అక్కడి బయ్యర్లు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రియల్టీ సంస్థలపై 2020లో చైనా ప్రభుత్వం దాడులు చేసింది. దీంతో రియల్టీ సంస్థల కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఇక యంగ్ హుయన్ కంట్రీ గార్డెన్ కూడా నిధుల కొరతను ఎదుర్కొంటుంది. షేర్ల విక్రయం ద్వారా 343 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్టు ప్రకటించింది. అప్పులు చెల్లించేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకటనతో ఈ కంపెనీ షేర్లు బుధవారం భారీగా పతనమయ్యాయి.


కాగా యంగ్‌కు ఇంత ఆస్తి తన తండ్రి యంగ్ గుక్వియాంగ్ నుంచి వారసత్వంగా వచ్చింది. ప్రొపర్టీ డెవలపర్ కంపెనీ ‘కంట్రీ గార్డెన్’ వ్యవస్థాపకుడే యంగ్ గుక్వియాంగ్. కంపెనీలో తన షేర్లను 2008లో కూతురికి ఆయన బదిలీ చేశారు. 2 ఏళ్ల తర్వాత కంపెనీ హాంగ్‌కాంగ్‌లో ఐపీవో లిస్టింగ్‌కి వచ్చింది. దీంతో యంగ్ హుయన్ ఆస్తి విలువ అమాంతం పెరిగిపోయింది. ఇటివల చైనాలో రియల్టీ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. కెమికల్ ఫైబర్స్ దిగ్గజం ‘ఫ్యాన్ హోంగోవే’ యజమానురాలు దూసుకొస్తున్నారు. గురువారం నాటికి 11.2 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నాయి.

Updated Date - 2022-07-29T01:33:04+05:30 IST