ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనల మేరకే కౌంటింగ్‌

Sep 17 2021 @ 22:21PM
కావలిలో కౌంటింగ్‌ ఏర్పాట్ల పై పోలీసులకు సూచనలిస్తున్న ఏఎస్పీ వెంకటరత్నం

ఏఎస్పీ వెంకటరత్నం

కావలి, సెప్టెంబరు 17: జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనలు మేరకు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు. కావలి విశ్వోదయ ఇంజనీరింగ్‌ కళాశాలలో కావలి రూరల్‌, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ జరుగనుండటంతో ఆ కేంద్రాలను శుక్రవారం స్థానిక పోలీస్‌ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అలాగే కావలి ఆర్డీవో శీనా నాయక్‌ కూడా కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ వెంకటరత్నం కౌంటింగ్‌ ఏర్పాట్లపై  స్థానిక పోలీస్‌ అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కావలి ఏఎస్పీ డీ. ప్రసాద్‌రావు, సీఐలు శ్రీనివాసరావు, మల్లికార్జున, అక్కేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.