కరోనా కాలం.. మందులతో ఆరు అడుగుల దుర్గాదేవి విగ్రహం

ABN , First Publish Date - 2020-10-26T02:22:16+05:30 IST

అసోంలోని దుబ్రికి చెందిన ఓ కళాకారుడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. శరన్నవరాత్రులను పురస్కరించుకుని సంజీబ్

కరోనా కాలం.. మందులతో ఆరు అడుగుల దుర్గాదేవి విగ్రహం

దిస్పూర్: అసోంలోని దుబ్రికి చెందిన ఓ కళాకారుడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. శరన్నవరాత్రులను పురస్కరించుకుని సంజీబ్ బసక్ తయారుచేసిన దుర్గాదేవి విగ్రహమే అందుకు కారణం. కాలం చెల్లిన మందులు, క్యాప్సూల్స్, ఇంజక్సన్ వయల్స్‌తో ఈ విగ్రహాన్ని రూపొందించాడు. అమ్మవారి విగ్రహాన్ని చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. సంజీబ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


దుబ్రి జిల్లా యంత్రాంగంలో పనిచేస్తున్న సంజీబ్.. కరోనా సమయంలో ప్రజలు ఫార్మసీ దుకాణాల వద్దక్యూకట్టడం చూశాడు. అలాగే, కరోనా పోరులో ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా కాలం చెల్లిన మందుల స్ట్రిప్‌లు, ఇంజెక్షన్ వయల్స్‌తో 6 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. ట్యాబ్లెట్‌పై ట్యాబ్లెట్, స్ట్రిప్‌పై స్ట్రిప్‌ను పేర్చుకుంటూ పోయాడు. అలా మొత్తం 60 రోజులపాటు రాత్రనక, పగలనక కష్టపడి అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించాడు. ఇందుకోసం మొత్తం 30 వేల క్యాప్సూల్స్, సిరంజిలు ఉపయోగించాడు.  


Updated Date - 2020-10-26T02:22:16+05:30 IST