అసోం చానెల్ హ్యాక్.. లైవ్ ఫీడ్‌లో పాకిస్తాన్ జెండా ప్రత్యక్షం..

ABN , First Publish Date - 2022-06-13T03:32:12+05:30 IST

అసోంలో జనాదరణ కలిగిన యూట్యూబ్ న్యూస్ చానెల్‌ ‘టైమ్8’పై సైబర్ దాడి జరిగింది. లైవ్ ప్రసారం మధ్యలో పాకిస్తాన్ జెండా ప్రత్యక్షమైంది.

అసోం చానెల్ హ్యాక్.. లైవ్ ఫీడ్‌లో పాకిస్తాన్ జెండా ప్రత్యక్షం..

దిస్పూర్ : అసోం(Assam)లో జనాదరణ కలిగిన యూట్యూబ్ న్యూస్ చానెల్‌ ‘టైమ్8(Time8)’పై సైబర్ దాడి జరిగింది. లైవ్ ప్రసారం(Live broadcast) మధ్యలో పాకిస్తాన్(Pakistan) జెండా ప్రత్యక్షమైంది. మహ్మద్ ప్రవక్తను పొగుడుతూ ఓ కీర్తన వినిపించింది. ‘రెస్పెక్ట్ హోలీ ప్రొఫెట్’ పేరిట సంజ్ఞలు కనిపించాయి. బీజేపీ మాజీ అధికారప్రతినిధి నూపుర్ శర్మ  వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇటివలే ఈ హ్యాకింగ్ జరిగింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న  హ్యాకింగ్ గ్రూప్ ‘రెవల్యూషన్ పీకే’ ఈ సైబర్ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. కాగా డిజిటల్ నెట్‌వర్క్  ‘టైమ్8’ అసోం కేంద్రంగా పనిచేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై ఈ చానెల్‌కు 7 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. నెలవారీ  వ్యూస్ 600 మిలియన్లు పైమాటే. కాగా జూన్ 9న లైవ్ న్యూస్ స్ట్రీమ్ జరుగుతున్న సమయంలో ఈ సైబర్ దాడి జరిగింది. బ్రేకింగ్ న్యూస్ సెగ్మెంట్ సమయంలో జరిగింది.

Updated Date - 2022-06-13T03:32:12+05:30 IST