రాహుల్‌ ఏ తండ్రి కుమారుడని మేమెప్పుడైనా అడిగామా?

ABN , First Publish Date - 2022-02-12T07:07:16+05:30 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రాహుల్‌ ఏ తండ్రి కుమారుడని మేమెప్పుడైనా అడిగామా?

  • సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై రుజువెందుకు?
  • ముస్లింలకు విద్య కావాలి.. హిజాబ్‌ కాదు
  • ఈ వివాదానికి కాంగ్రెస్సే కారణం
  • ఉత్తరాఖండ్‌ ఎన్నికల ర్యాలీలో 
  • అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ


’కిచ్చా, ఫిబ్రవరి 11: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ నేతృత్వంలో 2016లో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై రాహుల్‌ రుజువులు అడిగారని, కానీ ఆయన ఏ తండ్రి కుమారుడో తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా అని హిమంత ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని కిచ్చాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో హిమంత మాట్లాడారు. ‘‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై సాక్ష్యాధారాలు కావాలని అడిగే హక్కు మీకు (కాంగ్రెస్‌) ఎవరిచ్చారు? పాకిస్థాన్‌ భూభాగాల్లోకి ప్రవేశించి దాడులు చేశామని మన సైనికులు స్పష్టం చేశారు. సైనికులు చెప్పిందే ఫైనల్‌’’ అని హిమంత అన్నారు. అలాగే కర్ణాటకలోని విద్యా సంస్థల్లో గత కొద్ది రోజులుగా హిజాబ్‌-కాషాయ కండువాల వివాదంపైనా ఆయన స్పందించారు. ముస్లిం విద్యార్థులకు విద్య అవసరమని, హిజాబ్‌ కాదని  అన్నారు.


వారు హిజాబ్‌ ధరిస్తే, విద్యపై శ్రద్ధ పెడుతున్నారనే విషయం టీచర్లకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ‘‘తమకు హిజాబ్‌ కావాలని మూడేళ్ల క్రితం విద్యార్థులు కోరలేదు. ఇప్పుడే ఈ వివాదం ఎందుకొచ్చింది? ఈ వివాదానికంతటికీ కాంగ్రెస్‌ పార్టీయే కారణం. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. టుక్టే టుక్డే గ్యాంగ్‌కు ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్‌.. దేశం కా దు. రాష్ట్రాల కలయిక అని కొన్నిసార్లు కాంగ్రెస్‌ నేతలు అం టారు. ఇదంతా చూస్తుంటే జిన్నా ఆత్మ కాంగ్రె్‌సలోకి ప్రవేశించిందేమో అనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ విభజన రాజకీయాలకు తెర పడుతుంది’’ అని సీఎం అన్నారు. 

Updated Date - 2022-02-12T07:07:16+05:30 IST