వరదలతో వణుకుతున్న అసోంకు Mukesh Ambani రూ. 25 కోట్ల సాయం

ABN , First Publish Date - 2022-06-25T02:53:48+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అతలాకుతలమవుతున్న అసోం (Assam)కు రిలయన్స్ అధినేత ముకేశ్

వరదలతో వణుకుతున్న అసోంకు Mukesh Ambani రూ. 25 కోట్ల సాయం

ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అతలాకుతలమవుతున్న అసోం (Assam)కు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani) రూ. 25 కోట్ల సాయం అందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌ (CM Relief Fund)కు అందించిన ఈ సాయంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. అంబానీ అందించిన సాయాన్ని కొనియాడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రూ. 25 కోట్లు విరాళమిచ్చి అసోం ప్రజల తరపున నిలబడ్డారంటూ ప్రశంసించారు. 


అసోం వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లోని పంటలు నాశనమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కాగా, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor), దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) కూడా అసోంకు తమవంతు సాయం ప్రకటించారు. చెరో రూ. 5 లక్షలు అందించారు. 

Updated Date - 2022-06-25T02:53:48+05:30 IST