కోవిడ్ పోరులో ఇక డ్రోన్లు.. ఏ రాష్ట్రంలో అంటే..

ABN , First Publish Date - 2021-07-12T09:10:47+05:30 IST

కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అస్సాం ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఆ రాష్ట్ర సీఎం హేమంత బిస్వ శర్మ ఆదేశాలతో..

కోవిడ్ పోరులో ఇక డ్రోన్లు.. ఏ రాష్ట్రంలో అంటే..

దిస్‌పుర్: కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అస్సాం ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఆ రాష్ట్ర సీఎం హేమంత బిస్వ శర్మ ఆదేశాలతో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో డ్రోన్లను వినియోగించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రజల కదలికలు, ఎక్కువ జనాభా గుమిగూడే ప్రాంతాలపై నిఘా పెట్టనున్నారు. దీని ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఓ అంచనాకు రానున్నారు. బిశ్వనాథ్, దిబ్రూగడ్, గోలాఘాట్, జోర్హట్, కంరప్(మెట్రో), లక్ష్మిపూర్, నాగావ్, సోనిత్‌పూర్, శివసాగర్ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

Updated Date - 2021-07-12T09:10:47+05:30 IST