పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సామూహిక అత్యాచార నిందితుడు

ABN , First Publish Date - 2022-05-27T02:47:48+05:30 IST

బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితుడు తప్పించుకునే క్రమంలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సామూహిక అత్యాచార నిందితుడు

కోక్రాఝర్: బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితుడు తప్పించుకునే క్రమంలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో గురువారం జరిగిందీ ఘటన. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరితోపాటు నిందితుడిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అత్యాచార ఘటనను చిత్రీకరించిన సెల్‌ఫోన్‌ను దాచిపెట్టిన ప్రదేశానికి నిందితుడిని తీసుకెళ్లారు. 


సెల్‌ఫోన్ దాచిపెట్టిన ధోల్మారా రాణీపూర్ టీ గార్డెన్ సమీపానికి చేరుకున్న తర్వాత నిందితుడు ఓ పోలీసు అధికారి తుపాకి లాక్కుని వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మరో పోలీసు అధికారి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో నిందితుడి కుడికాలులోకి తూటాలు చొచ్చుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కోక్రాఝర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.


కాగా, గతేడాది మే నుంచి ఇప్పటి వరకు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, అధికారులపై దాడులకు దిగిన ఘటనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో  47 మంది ప్రాణాలు కోల్పోగా, 115 మంది తీవ్రంగా గాయపడ్డారు.  

Updated Date - 2022-05-27T02:47:48+05:30 IST