బాన్సువాడలో వివాహితపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-22T05:55:35+05:30 IST

బాన్సువాడ పట్టణంలో వివాహితపై గుర్తు తె లియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసు కుంది. వారంరోజుల క్రితమే బాన్సువాడ పట్టణంతో పాటు మండలం లో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన సంఘటనలు మరవకముందే మం గళవారం మరో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాన్సువాడ పట్టణంలోని మిస్రీగల్లీకి చెందిన వివాహిత సభ అంజూమ్‌ తన ఇంట్లో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చైన్‌పానాతో తలపై తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయ డంతో వారు పరారీ అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తె లుసుకున్న ఆమె భర్త అఫ్రోజ్‌ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, రూరల్‌ సీఐ మురళి అక్కడికి చేరుకొని పరిశీలించారు.

బాన్సువాడలో వివాహితపై హత్యాయత్నం

బాన్సువాడ, జూన్‌ 21: బాన్సువాడ పట్టణంలో వివాహితపై గుర్తు తె లియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసు కుంది. వారంరోజుల క్రితమే బాన్సువాడ పట్టణంతో పాటు మండలం లో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన సంఘటనలు మరవకముందే మం గళవారం మరో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాన్సువాడ పట్టణంలోని మిస్రీగల్లీకి చెందిన వివాహిత సభ అంజూమ్‌ తన ఇంట్లో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చైన్‌పానాతో తలపై తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయ డంతో వారు పరారీ అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తె లుసుకున్న ఆమె భర్త అఫ్రోజ్‌ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, రూరల్‌ సీఐ మురళి అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఇంటి పరిసరాల ను పరిశీలించగా ఇంటి పక్కన దాడి చేసిన చైన్‌పానా లభ్యమైంది. హ త్యాయత్నానికి గల కారణాలను డీఎస్పీ జైపాల్‌ రెడ్డి విచారణ చేప డుతున్నారు. బాన్సువాడ పట్టణంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. ప్ర స్తుతం సభ అంజూమ్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తు తం ఆమె పరిస్థితి విషయంగా ఉందని, ఆపరేషన్‌ చేసిన తరువాతనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. వివాహితపై హత్యాయత్నా నికి గల కారణాలు, ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఇ ప్పటికే అనుమానిత నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచా రం. పట్టణ సీఐ రాజశేఖర్‌ రెడ్డిని వివరణ కోరగా వివాహిత కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అయినప్పటికీ హత్యా యత్నానికి గల కారణాల కోసం విచారణ చేపడుతున్నామని తెలిపారు. వారం రోజుల నుంచి బాన్సువాడలో వరుస హత్యలు హత్యాయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2022-06-22T05:55:35+05:30 IST