
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) సమావేశం ఈ నెల 7వ తేదీ ఉదయం 11గంటలకు జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ కమిటీహాల్ లో జరిగే సమావేశంలో 2014,15 నుంచి 2018,19 వరకు మున్సిపల్ పరిపాలన, సీఅండ్ ఏజీ, అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన కార్యకలాపాలపై సమావేశం జరుగనుంది. అలాగే 8వ తేదీన ఉదయం 11గంటలకు వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్ మెంట్ శాఖ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి