భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్‌లు

ABN , First Publish Date - 2022-03-10T12:59:54+05:30 IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అనంతరం ఫలితాల అప్‌డేట్‌లను 24 గంటల పాటు భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)వెబ్‌సైట్‌లో ఉంచుతామని...

భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్‌లు

 న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అనంతరం ఫలితాల అప్‌డేట్‌లను 24 గంటల పాటు భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఈసీ తెలిపింది.ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల  ఎన్నికల ఫలితాలను ఈసీఐ వెబ్‌సైట్‌లో ప్రజలు చూడవచ్చని ఈసీ పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లోని 1,200 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 750కిపైగా కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం కావడంతో దేశంలోని ప్రజలు వీటిపై ఆసక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఫలితాలపై ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఈసీతోపాటు ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ కూడా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. 


Updated Date - 2022-03-10T12:59:54+05:30 IST