వైఫల్యాలపై సమరం

ABN , First Publish Date - 2020-11-30T05:03:34+05:30 IST

‘భారీ వర్షాలు, తుఫాన్‌లు, వెంటాడిన వాయుగుండాలు ముప్పేట పంటలపై దాడి చేశాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదిగో ఇదిగో అంటూనే ప్రభుత్వం కాలక్షేపం చేసింది.

వైఫల్యాలపై సమరం

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 

(ఏలూరు–ఆంఽధ్రజ్యోతి)   ‘భారీ వర్షాలు, తుఫాన్‌లు, వెంటాడిన వాయుగుండాలు ముప్పేట పంటలపై దాడి చేశాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదిగో ఇదిగో అంటూనే ప్రభుత్వం కాలక్షేపం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఆదేశాల్లో చూపిన హడావుడి ఆచరణలో కన్పించనే లేదు. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యత కొట్టొ చ్చినట్టు కనపడింది’. అంటూ బాధిత రైతులే ఈ తరహా ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలన్నింటినీ శాసన సభలో వీలు చిక్కితే లేవనెత్తుతాం. అన్నిటి కంటే మించి కేవలం 5 రోజుల వ్యవధిలోనే సమావేశాలు ముగించడం పట్ల ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్షం మాత్రం ఏడాదిన్నర వ్యవధిలోనే ప్రభుత్వం అనేక విజయాలను మూటకట్టుకుం దని, సంక్షేమ పఽథకాలు వెల్లువలా వచ్చి పడ్డాయని, పేద వర్గాలకు అవసరానికి తగిన ధనం అందించడమే కాకుండా వారి బాగోగులకు వైసీపీ ప్రభు త్వం తోడుగా నిలిచిందని అధికారపక్ష ఎమ్మెల్యేలు గట్టిగా వాదిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి.


 వ్యవసాయ ఆధారిత అంశాలే కీలకం..

ప్రత్యేకించి వరుసగా మూడు సార్లు వాయుగుండం, తుఫాన్‌లు విరుచుకుపడడంతో రైతు నట్టేట మునిగాడు. రైతులు పెట్టుబడి కోల్పోయారు. నష్టాలను చవిచూశారు, ఖరీఫ్‌ పంటలోనే కోలుకోలేనంతగా దెబ్బతిన్నారు. పంటపై పెట్ట్టుకున్న ఆశలన్నీ నీళ్ల పాలు అయ్యాయి. వాస్తవానికి ప్రతీసారీ ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, వరదల కారణంగా డెల్టాతో పాటు మిగతా కొన్ని మండలాల్లోనూ రైతులు మూడు నెలలుగా ఎదురీదుతూనే ఉన్నారు. గోదా వరి వరదలు వచ్చినప్పుడు సుమారు రూ.1.40కోట్లు పంట నష్టం ఏర్పడినట్టు అప్పట్లో వ్యవసాయాధికారులు అంచనా కు వచ్చారు. వాస్తవానికి అప్పట్లోనే ఈ నష్టం అపారంగా ఉన్నా అధికారిక లెక్కలకు అవి ఎక్కలేదు. రెండవ విడతలో భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే రైతులకు ఎదురయ్యింది. దాదాపు 28 మండలాలకు పైగా రైతులు పంట నష్టం చవిచూశారు. కేవలం పైపైన తమకు తోచిన విధంగా నివేదికలు రూపొం దించినట్టు రైతులు ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు.  గడచిన రెండు సార్లు వరదల కారణంగా వచ్చిన నష్టాలతో దాదాపు రూ.90 కోట్లు పంట నష్టం జరగ్గా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుర్తించిన ప్రాంతంలో కొందరికే పరిహారం అందజేసి చేతులు దులుపు కుంది. ‘ఖరీఫ్‌లో రైతు ప్రతీ సారి నష్టాల పాలే అయ్యాడు. కానీ అధికారిక లెక్కల ప్రకారం అంతా బాగా చేశామని చెబుతూనే కొందరికి పరిహారం పరిమితం చేశారు. ఇన్‌పు ట్‌ సాయం అందించడంలో ఈ ప్రభుత్వ వైఫల్యత చాలా ప్రాంతాల్లో స్పష్టంగానే ఉంది. ఈ విషయంలో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు’ అని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 


 పోలవరం మాటేంటి..!

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు కుదిస్తారని సంకేతాలు ఉండగా ప్రభుత్వం మాత్రం దీనిని మసిపూసి మారేడు కాయ చేస్తుందని రైతు సంఘాలు రగిలిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజులకు రైతు సంఘాల ప్రతినిధులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. గోదావరి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలవరంపై పోరాడాల్సిందిగా పదేపదే వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. 


ఇళ్ల మాటేంటి.

టిడ్కో ఇళ్ల విషయంలో పాత వారిని తప్పించి కొత్త వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయ ని, మరో వైపు ఇంటి స్థలం కావాలా టిడ్కో ఇళ్లు కావాలా అని మభ్య పెడుతున్నారని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇంతక ముందు నిలదీశారు. దీనికి తోడు వామపక్షాల అలజడికి లబ్ధిదారుల ఆందోళనలు తోడ వ్వడంతో ఈ మధ్యనే సర్కార్‌ కొంత మెత్తప డింది. అయినప్పటికీ ప్రభుత్వ ధోరణిపై వైసీపీయే తర పక్షాలన్నీ గుర్రుగానే ఉన్నాయి. ఈ విషయాన్ని  శాసన సభలో ప్రస్తావిస్తామని, పేదలకు అండగా నిలబడ తామని శాసనసభ టీడీపీ ఉపనేత నిమ్మల రామా నాయుడు అన్నారు.


 మరికొన్ని సమస్యలపై దృష్టి

జిల్లాలో అనేక అంశాలు ఇప్పటికే మూలన పడి ఉండగా కేవలం కొన్నింటిని మాత్రమే చర్చించేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామనడంపైన కొంత అసంతృప్తి లేకపోలేదు. డెల్టా ఆధునికీకరణ మూలన పడడం, తాజాగా రబీకి సాగునీరు అందించ లేక రబీ సీజన్‌ను కుదించే ప్రయత్నం చేయడం, పేదల గృహాలు, రహదారుల అధ్వాన పరిస్థితి, పోలవరం ప్రాజెక్ట్‌, ఎత్తిపోతల పథకాలలో పురోగతి నిలిచిపోవడం, సంక్షేమ పఽథకాల్లో ఏకపక్ష ధోరణుల వంటి అంశాలన్నీ ఇప్పటికే బహిరంగంగా చర్చ జరుగుతున్నది. వీటన్నింటిపైనా వీలుకుదిరితే చర్చించాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా తిప్పి కొట్టాలని అధికార పక్ష ఎమ్మెల్యేలు నోట్స్‌ సిద్ధం చేస్తున్నారు. 


వైఫల్యాలు నిలదీస్తాం

సర్కార్‌ వైఫల్యాలు అన్నీ ఇన్నీ కావు. సమయం తక్కువగా సమావేశాలకు కేటాయించడం అత్యంత దారుణం. 5 రోజులు కాదు శాసన సభ సమావేశాలు  10 రోజులు పెంచాలని కోరాం. రైతుల ఇబ్బందులు  అన్నీ ఇన్నీ కావు. పేద వర్గాలు నలిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అవినీతి అన్ని చోట్లా తాండవిస్తున్నది. ఇళ్ళ స్థలాల నుంచి సంక్షే మ పఽఽథకాల వరకు అన్నింటి పైన సర్కార్‌ను నిలదీస్తాం. 

– నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే

Updated Date - 2020-11-30T05:03:34+05:30 IST