ఆస్తుల పరిరక్షణ, వ్యాపారాభివృద్ధే లక్ష్యం

Jul 23 2021 @ 01:06AM
సీడీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ దంపతులను సన్మానిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సీడీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి


చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 22: కబ్జాలకు గురవుతున్న సొసైటీ ఆస్తుల పరిరక్షణతో పాటు, వ్యాపారాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (సీడీసీఎంఎస్‌) నూతన చైర్‌పర్సన్‌ సామకోటి నాగలక్ష్మి అన్నారు. గురువారం గాంధీ రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో ఆమె పాలకవర్గంలోని ఆరుగురు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆవరణలో జరిగిన సమావేశంలో రైతులను ఉద్ధేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఆస్తులను రక్షించి, సొసైటీని లాభాల బాటలో తీసుకొస్తానని చెప్పారు. డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, డీసీవో చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో మనోహర్‌గౌడ్‌, నాబార్డు  డీడీఎం సునీల్‌, తదితరులు చైర్‌పర్సన్‌ను అభినందించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.